: కేరళలో ప్రిన్స్ చార్లెస్ పుట్టినరోజు వేడుకలు
భారత పర్యటనలో ఉన్న ప్రిన్స్ చార్లెస్ ఈ రోజు తన 65వ పుట్టినరోజు వేడుకలను కేరళలోని కుమరోమ్ రిసార్ట్స్ లో జరుపుకోనున్నారు. అటు కేరళ సీఎం వూమెన్ చాందీ ప్రిన్స్ చార్లెస్ దంపతులను విందుకు ఆహ్వానించారని, చార్లెస్ కు పుట్టినరోజు బహుమతులు కూడా అందించారని అధికారులు తెలిపారు. తొమ్మిది రోజుల భారత పర్యటనకు వచ్చిన రాయల్ కపుల్ ఈ మధ్యాహ్నం కొలంబో వెళ్లనున్నారు. అక్కడ జరిగే కామన్ వెల్త్ సమావేశాల్లో ప్రిన్స్ చార్లెస్ పాల్గొంటారు.