: అతివేగమే బస్సు ప్రమాదానికి కారణం: కర్ణాటక రవాణా శాఖ మంత్రి


కర్ణాటక హవేరి జిల్లాలోని కునుమళ్లహళ్లి వద్ద నేషనల్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అతివేగంతో వెళ్తుండడమే ప్రమాదానికి కారణమని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి బెంగళూరులో తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 140-150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టు ఆయన వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం వద్ద జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు ప్రమాద ఘటన, ఈ రోజు కునుమళ్లహళ్లి వద్ద జరిగిన ఘటన ఒకే విధంగా ఉన్నాయని చెప్పారు. మృతుల్లో ఒకరు ముంబయికి చెందిన శ్రీరాంగా గుర్తించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News