: ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వాయిదా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. రాష్ట్ర విభజనపై ఈ రోజు రాత్రి 8 గంటలకు కేంద్ర మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కావాల్సిఉంది. రచ్చబండ కార్యక్రమం ఉన్నందున తాను మీటింగ్ కు హాజరుకాలేనని సీఎం తెలిపినట్టు సమాచారం. దీనికితోడు, ఈ నెల 18 వరకు దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో, దిగ్విజయ్ ఢిల్లీ వచ్చిన తర్వాతే సీఎం హస్తిన పర్యటన ఉంటుందని సమాచారం.