: కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో జీవోఎం భేటీ
రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఈ రోజు నాలుగు కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమవుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు హోంశాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఆర్ధిక, న్యాయ, రైల్వే, సిబ్బంది వ్యవహారాల శాఖల కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.