: బైరెడ్డి వాహనం ధ్వంసం చేసి.. డ్రైవర్ ను చెట్టుకు కట్టేసి చితగ్గొట్టిన గ్రామస్తులు


రాయసీమ హక్కుల పరిరక్షణ పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి డ్రైవర్ ను చిత్తూరు జిల్లా వరదాయపాలెం గ్రామస్తులు చెట్టుకు కట్టేసి చితగ్గొట్టారు. బైరెడ్డి ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెళ్తున్న ఆటో సైడ్ ఇవ్వలేదన్న కారణంతో ఆటో డ్రైవర్ ను బైరెడ్డి డ్రైవర్ చితకబాదాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు బైరెడ్డి వాహనాన్ని ధ్వసం చేసి, డ్రైవర్ ను చెట్టుకు కట్టేసి చితకబాదారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. బైరెడ్డి పైనా గ్రామస్తులు దాడికి దిగడంతో పోలీసు రక్షణలో ఆయన బయటపడ్డారు.

  • Loading...

More Telugu News