: ఫిబ్రవరి 14 నుంచి వరల్డ్ కప్ టికెట్ల అమ్మకం


2015 ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ టికెట్లను సరిగ్గా ఏడాది ముందే విక్రయానికి ఐసీసీ రంగం సిద్ధం చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరుగనున్న ఐసీసీ వరల్డ్ కప్ కు 2014 ఫిబ్రవరి 14 నుంచి టికెట్లు విక్రయించనున్నారు. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లను సుమారు 10 లక్షల మంది క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉందని ఐసీసీ భావిస్తోంది.

వంద కోట్ల మందికి పైగా క్రీడాభిమానులు టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను వీక్షిస్తారని అంచనా వేశారు. ఫైనల్ సహా అన్ని మ్యాచ్ లకు బాలలకు ప్రత్యేకంగా 320 రూపాయల నుంచి టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. కాగా పెద్దలకు ఈ టికెట్ల ధర 1300 నుంచి ప్రారంభం కానుంది.

కుటుంబ సమేతంగా వచ్చే వారికి ఈ టికెట్ల ధర మరింత తగ్గించారు. నలుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబానికి 3200 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించారు. ఆసీస్, కివీస్ దేశాలు దాదాపు 20 ఏళ్ల తరువాత వరల్డ్ కప్ క్రికెట్ కు ఆతిధ్యమివ్వనున్నాయి. దీంతో అభిమానుల నుంచి మంచి స్పందన ఉంటుందని ఐసీసీ భావిస్తోంది.

  • Loading...

More Telugu News