: జీవోఎం ముందుకు సీఎం
సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి జీవోఎం నుంచి పిలుపు వచ్చింది. రేపు సాయంత్రం 8 గంటలకు జీవోఎం ముందు హాజరు కావాలని అధిష్ఠానం కిరణ్ కుమార్ రెడ్డికి సూచించింది. పలు శాఖల అధికారులతో విస్తృత సమావేశాలు జరుపుతున్న జీవోఎం, ఇప్పటికే ఎనిమిది శాఖలతో సమావేశమై నివేదికలు తీసుకుంది. మరో ఎనిమిది శాఖల అధికారులతో రేపు సాయంత్రం 4 గంటల నుంచి సమావేశం కానుంది. వీరి సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రితో జీవోఎం సమావేశం కానుంది.