: కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతోంది : మైసూరారెడ్డి
మరికొద్ది సేపట్లో వైఎస్సార్సీపీ జీవోఎంతో భేటీ కాబోతోంది. వైసీపీ తరపున మైసూరారెడ్డి, గట్టు రాంచంద్రరావు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మైసూరా మాట్లాడుతూ, రాష్ట్ర విభజన చాలా క్లిష్టమైన ప్రక్రియ అని అన్నారు. విభజన వల్ల మూడు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బంది పడతారని తెలిపారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ విభజనకు పూనుకుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతూ ప్రజలను మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. జీవోఎం విధానాలు మూడు ప్రాంతాలను విడగొట్టడానికే తప్ప... సమైక్యంగా ఉంచడానికి కాదని అన్నారు.