: కండలేరు నుంచి నీటి తరలింపు జీవో రద్దు చేయాలి: సోమిరెడ్డి
కండలేరు జలాశయం నుంచి చిత్తూరు జిల్లాకు నీటి తరలింపు జీవోను రద్దు చేయాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 లోగా జీవో రద్దు చేయకపోతే కండలేరు వద్ద రైతులతో కలిసి ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.