: ఈ నెల 20 నుంచి గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
ప్రపంచ సినిమాలోని నూతన పోకడలను పరిచయం చేస్తూ ఈ నెల 20 నుంచి 30 వరకు గోవాలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచార కార్యాలయ అదనపు డైరెక్టర్ ఎంవీవీఎన్ మూర్తి తెలిపారు. ఈ చిత్రోత్సవాల్లో 160 విదేశీ చిత్రాలు ప్రదర్శించనున్నారు. మయూర పురస్కారం కోసం 15 సినిమాలు పోటీ పడనున్నాయి. పోటీలో విజేతకు పురస్కారంతో పాటు నగదు బహుమతి ఉంటుందని మూర్తి వివరించారు. ఈ ఏడాది గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రత్యేక పురస్కారాన్ని ఏర్పాటు చేశామని... కళాత్మక విలువలు, అత్యున్నత సాంకేతిక నైపుణ్యాలున్న చిత్రానికి ఆ పురస్కారం ప్రదానం చేయనున్నట్టు ఆయన తెలిపారు.