: విదేశీ విరాళాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా స్పందించలేదు : షిండే


అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ)కి కేంద్ర హోం శాఖ ఒక ప్రశ్నావళిని పంపించింది. విదేశాల నుంచి విరాళాలు ఏ విధంగా సేకరించారో చెప్పాలంటూ ప్రశ్నలను సంధించింది. అయితే, ఇంతవరకు ప్రశ్నావళిపై ఏఏపీ స్పందించలేదని కేంద్ర హోం మంత్రి షిండే తెలిపారు.

గత నెలలో ఢిల్లీ హైకోర్టు ఏఏపీ స్వీకరించిన విదేశీ విరాళాల గురించి పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు డిసెంబర్ 10 నాటికి దీనికి సంబంధించిన రిపోర్టును అందజేయాల్సి ఉంటుంది. ఏఏపీ 63 వేల మంది (రిక్షా కార్మికుల నుంచి పారిశ్రామికవేత్తలు, ఎన్నారైల వరకు) అభిమానుల నుంచి రూ. 19 కోట్ల విరాళాలు సేకరించింది. దీనిపై కేజ్రీవాల్ కూడా అనుకూలంగానే స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కూడా తాను స్వీకరించిన రూ. 2 వేల కోట్లకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కూడా విరాళాల వివరాలు తెలపాలని కోరారు. ఎన్నారైల నుంచి విరాళాలు స్వీకరించడం తప్పేమీ కాదని... అన్ని వివరాలు తమ వెబ్ సైట్లో ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు.

  • Loading...

More Telugu News