: చర్చలతోనే విభజన సాధ్యం : ఎర్రబెల్లి
చర్చలతోనే రాష్ట్ర విభజన సాధ్యపడుతుందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మాట్లాడారు. బీహార్ ను విభజించవద్దని, ఒకవేళ విభజిస్తే తన మీదనుంచి నడిచి వెళ్లి విభజించండని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నాడని... అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం చర్చలు జరిపి జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
అలాగే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత జేఏసీలను, నేతలను పిలిచి మాట్లాడి విభజన చేయాలని ఆయన సూచించారు. యూటీ, ఆదాయం అంటూ కిరికిరి పెడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. భద్రాచలం ఆంధ్ర ప్రాంతానిదని, దేవాలయం మాత్రం తెలంగాణ ప్రాంతానిదేనని ఆయన అన్నారు. తాము అఖిల పక్షానికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు.