: కేంద్ర మంత్రులపై అశోక్ బాబు విసుర్లు


'మా దురదృష్టం మా కేంద్ర మంత్రులే'నని ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ మా ప్రాంత కేంద్ర మంత్రులు చేతకాని వాళ్లన్నారు. యూటీ, ప్యాకేజీలు అంటూ వారు మాట్లాడడం వారి అమాయకత్వాన్ని సూచిస్తోందన్నారు. విభజనపై సీఎం కిరణ్ కన్విన్సయ్యారేమో కానీ, తాము మాత్రం కాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్యాకేజీ, యూటీ అంటూ కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించడం తగదని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News