: సచిన్ 200వ టెస్టు టికెట్ల విక్రయానికి బ్రేక్


క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సచిన్ చివరి టెస్టు మ్యాచ్ టికెట్ల విక్రయానికి బ్రేక్ పడింది. సచిన్ 200వ టెస్టుకు ముంబై క్రికెట్ సంఘం ఈ ఉదయం ఆన్ లైన్లో టికెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. అయితే, కాసేపట్లోనే సాంకేతిక సమస్యతో నెట్ వర్క్ పని చేయడం మానేసింది. దీంతో టికెట్లను గురువారం నుంచి అమ్మనున్నామని ముంబై క్రికెట్ సంఘం తెలిపింది. వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్ కు టికెట్ల ధరలను 500, 1000, 2500 రూపాయలుగా నిర్ణయించారు. వెబ్ సైట్ ద్వారా ఒక్కొక్కరికి రెండు టికెట్లను మాత్రమే అమ్మనున్నారు.

  • Loading...

More Telugu News