: సరిహద్దుల వెంబడి కాల్పులు పాక్ పనే: షిండే
సరిహద్దుల వెంబడి తీవ్రవాదులు జరిపే కాల్పులు పాకిస్థాన్ లో ఉన్న మూడు ఉగ్రవాద ఏజెన్సీలు జరిపేవేనని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. ఢిల్లీలో శాంతి భద్రతలపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్, బంగ్లా సరిహద్దుల్లో 90 శాతం కంచె వేశామని తెలిపారు. చైనా సరిహద్దులపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. మయన్మార్ సరిహద్దులు దట్టమైన అటవీ ప్రాంతమని, అక్కడ కూడా కంచె ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని షిండే అన్నారు. కంచె ఏర్పాటు చేస్తే సమస్యలు చాలా వరకు తగ్గుతాయని తాము విశ్వసిస్తున్నట్టు షిండే తెలిపారు.