: ఈ కృత్రిమ రక్తం ఎవరికైనా ఎక్కించవచ్చు


ఇప్పటి వరకూ గుండెకు, ఇంకా పలు మానవ శరీర అవయవాలకు కృత్రిమ అవయవాలను తయారుచేశారు. రక్తానికి కూడా సింథటిక్‌ హిమోగ్లోబిన్‌ నుండి కృత్రిమ రక్తాన్ని శాస్త్రవేత్తలు తయారుచేసేవారు. కానీ లండన్‌కు చెందిన పరిశోధకులు కృత్రిమ రక్తం తయారుచేసే సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇప్పటి వరకూ రోగులకు అవసరమైన రక్తం ఎక్కించాలంటే దాతలు అవసరం, ఒకవేళ దాత దొరికినా రోగి రక్త గ్రూపుకు సరిపోతుందో లేదో పరీక్షించాలి, దాత ఆరోగ్యాన్ని పరీక్షించాలి. ఇలా పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని రోగికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అలాకాకుండా ఈ కృత్రిమ విధానం ద్వారా మనకు అవసరమైన గ్రూపు రక్తాన్ని తయారుచేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఇప్పటి వరకూ సింథటిక్‌ హిమోగ్లోబిన్‌ ద్వారా కృత్రిమంగా రక్తం తయారుచేసేవారు. అలాకాకుండా సముద్రంలోని సూక్ష్మజీవుల నుండి తీసిన ప్రోటీన్‌ ద్వారా మనకు అవసరమైన గ్రూపు రక్తాన్ని తయారుచేసే సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రోగికి రక్తం ఎక్కించడంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రహీతకు ఎలాంటి సమస్యలు లేకుండా ఈ విధానంలో రక్తాన్ని అభివృద్ధి చేశామని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రక్తం మానవుని ల్యూకోసైట్స్‌పై చూపే ప్రభావాన్ని పరిశీలించామని, ప్రామాణిక గ్లుటరాల్డిహైడ్‌ పాలిమెరైజ్డ్‌ ద్రవంతో పోల్చితే ఈ కొత్త పద్ధతిలో తయారుచేసిన రక్తం మెరుగ్గా పనిచేస్తున్నట్టు గుర్తించామని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News