: గ్యాస్ కొరత, వర్షాభావ పరిస్థితుల వల్లే విద్యుత్ కోతలు: సీఎం


రాష్ట్రంలో ప్రస్తుతం విధించిన విద్యుత్ కోతలకు గ్యాస్ లభ్యత తగ్గడం, ఆశించినంతగా వర్షాలు కురియకపోవడమే కారణమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం ఈరోజు మెదక్ జిల్లా జహీరాబాద్ లో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ నెలకొల్పిన ట్రాక్టర్ల కర్మాగారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే అక్టోబర్ నాటికి విద్యుత్ సమస్యను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ లోటును భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం నెలకు అదనంగా రూ. 300 కోట్లు ఖర్చు చేస్తోందని సీఎం వెల్లడించారు. 

  • Loading...

More Telugu News