: కాంగ్రెస్ లీకేజీలతో ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది: నారాయణ
కాంగ్రెస్ పార్టీ లీకేజీలతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ, దిగజారుడు రాజకీయాలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యం కోసం కృషి చేస్తున్నారని, అయితే అంతా అయిపోయిందని, ఈ పరిస్థితుల్లో సీమాంధ్ర ఏం కావాలో కోరుకుంటే మంచిదని ఆయనకు హితవు పలికారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు మూడేళ్ల నుంచి సమైక్యం కోసం పోరాడితే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదన్నారు. 2000 సంవత్సరంలో తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వమన్నామని, ప్యాకేజీ ఇచ్చి ఉంటే అసలు ఉద్యమమే వచ్చేది కాదన్నారు. ఇప్పుడు రాయలసీమకు నీరు వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు.