: నరేంద్ర మోడీని తేలిగ్గా తీసుకోం : చిదంబరం


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో కాంగ్రెస్ పార్టీకీ సవాలేనని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ రోజు గోవాలోని పనాజీలో ఓ కార్యక్రమానికి హాజరైన చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీని తాము తేలిగ్గా తీసుకోమని అన్నారు. అయితే బహిరంగ సభల్లో మోడీ ఉపయోగిస్తున్న భాష సరిగాలేదని విమర్శించారు. ఎన్నికల వాగ్ధానాలు చేయడమే తప్ప... మోడీ కీలక విషయాల గురించి మాట్లాడటం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా రాహుల్ గాంధీనే నాయకత్వం వహిస్తారని చిదంబరం తెలిపారు.

  • Loading...

More Telugu News