: విశాఖ వన్డే రద్దు చేయాలి : న్యాయవాదుల జేఏసీ
భారత్, వెస్టిండీస్ ల మధ్య ఈ నెల 24న విశాఖలో జరగనున్న వన్డే మ్యాచ్ ను రద్దు చేయాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ సంఘం మద్దతును కోరింది. కోట్లాది మంది ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా... రాష్ట్రాన్ని విభజించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 23 వరకు న్యాయవాదులు విధులను బహిష్కరించారు.