: మహిళ దహనం... ఎమ్మెల్యే, మాజీ జడ్జి హస్తం


అమాయకురాలైన ఓ మహిళ జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా... చివరకు ఆమెను అగ్నికి ఆహుతి చేశారు. ఈ ఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలో జరిగింది. మరో దారుణమైన విషయం ఏంటంటే ఈ హత్య కేసులో మస్తూరి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేతో పాటు ఓ రెటైర్డ్ జడ్జి హస్తం కూడా ఉంది. వివరాల్లోకి వెళ్తే... మాజీ జడ్జి ఆర్.ఆర్.భరద్వాజ్ దగ్గరకు మూడేళ్ల క్రితం ఓ మహిళ వచ్చింది. ఆమెపై అత్యాచారం చేసిన భరద్వాజ్, తర్వాత ఆమెను ఎమ్మెల్యే కృష్ణ మూర్తి దగ్గరకు తీసుకెళ్లాడు. నీకు కావాల్సిన సహాయం ఎమ్మెల్యే చేస్తారని చెప్పాడు. అంతే కాకుండా, నీకు ఉద్యోగం కూడా ఇప్పిస్తారని చెప్పాడు. అనంతరం ఆమెను ఎమ్మెల్యే కృష్ణ మూర్తి అనేక సార్లు బలవంతంగా అనుభవించాడు. అంతే కాకుండా, ఇతరులతో కూడా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చాడు. ఇలా మూడేళ్ల పాటు ఆ మహిళ నరకయాతన అనుభవించింది.

చివరకు ధైర్యం తెచ్చుకున్న ఆ మహిళ పోలీసులను ఆశ్రయించి... జరిగిన విషయాన్నంతా పేర్కొంటూ ఎమ్మెల్యే, మాజీ జడ్జిపై కేసు పెట్టింది. ఇది జరిగిన వెంటనే భరద్వాజ్ ఆమెను తనకు సంబంధించిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం భరద్వాజ్ కు సంబంధించిన ప్రాంగణంలో ఆ మహిళ కాలిన శరీరంతో మృతురాలై కనిపించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. శాసనసభ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఈ ఘటన జరగడంతో, బీజేపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. కేసును లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని బిలాస్ పూర్ ఎస్పీ హరీష్ యాదవ్ తెలిపారు.

  • Loading...

More Telugu News