: తెలంగాణను సోనియా ఇస్తే.. ఆ ఘనతను మరెవరో కొట్టేయాలనుకుంటున్నారు : పొన్నాల
వరంగల్ లో జరుగుతున్న అభినందన సభలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోనియాను పొగడ్తలతో ముంచెత్తారు. కాంగ్రెస్ ను తెరాస రెచ్చగొడుతోందని... త్వరలోనే దీనిపై స్పందిస్తామని తెలిపారు. తెలంగాణను సోనియా ఇస్తే... ఆ ఘనతను మరెవరో కొట్టేయాలని చూస్తున్నారని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. తెలంగాణ డిమాండ్ కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. 2000వ సంవత్సరంలోనే తెలంగాణ డిమాండ్ ను వినిపించామని తెలిపారు.