: పాల అమ్మకందారుల సమస్యలు పరిష్కరించాలి: కోదండరాం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల అమ్మకందారులు కూడా కలిసి రావాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఇందుకోసం పాల విక్రేతలు రాజకీయ శక్తిగా ఏర్పడాలన్నారు. హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన జంటనగరాల ’పాలవిక్రేతల సంక్షేమ సంఘం‘ మొదటి వార్షికోత్సవంలో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, హైదరాబాదు, సికింద్రాబాదు నగరాల్లో పాల అమ్మకందారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలనీ, అంతేకాక ప్రత్యేక ప్రతిపత్తి కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.