: ప్రధాని శ్రీలంక వెళ్లకపోవచ్చు!


శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ దేశాధినేతల సమావేశానికి ప్రధాని వెళ్లడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ సమావేశం జరగనుంది. శ్రీలంకలో తమిళుల ఊచకోతకు నిరసనగా... ప్రధాని ఈ సమావేశాన్ని బహిష్కరించాలని, తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కరుణానిధి అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రధాని శ్రీలంక వెళ్లరాదంటూ ఏకంగా అల్టిమేటం జారీచేశారు.

ఈ నేపథ్యంలో, ప్రధాని శ్రీలంక పర్యటనకు వెళ్లకపోవచ్చని విదేశాంగ శాఖకు సంబంధించిన అత్యున్నత స్థాయి అధికారుల నుంచి సమాచారం అందుతోంది. ప్రధాని తరపున భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈ సమావేశాలకు హాజరవుతారని విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News