: కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ అరెస్టు


హైదరాబాద్ శేరిలింగంపల్లిలో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి ఆంక్షలు లేకుండా పది జిల్లాలు, హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుతూ టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 'తెలంగాణ కదం' యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీజేఏసీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యాత్రలు, బహిరంగ సభలపై ఆంక్షలు ఉన్న విషయాన్ని నేతల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో... పోలీసులు కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ లను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణవాదులు... అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు శేరిలింగంపల్లి నుంచి యాదగిరిగుట్టకు 'తెలంగాణ కదం' పేరిట పాదయాత్ర చేపట్టారు.

  • Loading...

More Telugu News