: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వర్షాలకు అవకాశం
ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో ఇది మరింత బలపడుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో అండమాన్, నికోబార్ దీవుల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం క్రమంగా మన రాష్ట్రం వైపు కదిలే అవకాశముందని, మన తీరాన్ని సమీపిస్తే రాష్ట్రంలోనూ విస్తారంగా వానలు కురిసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.