: మోడీకి రిపబ్లికన్ నేతల అభినందనలు
బీజేపీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన నరేంద్ర మోడీకి అమెరికాలోని రిపబ్లికన్ నేతలు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు ఈ నెల 19న వాషింగ్టన్ లోని కేపిటల్ హిల్ లో జరిగే కాంగ్రెస్(అమెరికా చట్టసభ) నేతలు, భారతీయ అమెరికన్ల సమావేశాన్ని ఉద్దేశించి శాటిలైట్ ద్వారా ప్రసంగించాలని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ మహిళా నేత మేక్ మోరిస్ రోడ్గర్స్ మోడీకి సందేశం పంపారు.