: టీడీపీ రెండో రోజు మేథో మథనం సదస్సు ప్రారంభం
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రెండో రోజు మేథో మథనం సదస్సు ప్రారంభమైంది. సీమాంధ్ర జిల్లాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో రాజకీయ వ్యూహాలు, ఇంటింటికీ తెలుగుదేశం కార్యాచరణ ప్రణాళిక, ఓటర్ల నమోదు ప్రక్రియ, ఇతర పార్టీల దుష్ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలి తదితర అంశాలపై ఇవాళ్టి భేటీలో సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది. బాబు తనయుడు నారా లోకేష రెండో రోజు కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.