: ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మందుపాతరల వెలికితీత


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గం పరిధిలో ఈరోజు రెండు మందుపాతరలను వెలికితీశారు. ఈ ప్రాంతంలో మందు పాతరలు ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు.

భాకరాపేట, రొంపిచెర్ల, కేవీ పల్లి అటవీ ప్రాంతాల్లో అణువణువు శోధించారు. చివరికి పీలేరు మండలం అప్పిరెడ్డిగారి పల్లె వద్ద రెండు మందుపాతరలను కనుగొనడంతో పెద్దగండం తప్పినట్టయింది. పీలేరు నియోజక వర్గంలో ఇంతకుముందు కూడా మందుపాతరలను వెలికితీసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News