: విభజనపై దిగ్విజయ్ ను కాలర్ పట్టుకుని నిలదీయండి : జగన్


విభజనపై కేంద్రం నిమిషాల్లో పరిష్కారం చూపాలనుకోవడం దారుణమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. విభజన విషయంలో కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఢిల్లీ పెద్దల తీరు ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. రోజుకో లీకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. మాకు ఓట్లు, సీట్లు కావాలి... మీ చావు మీరు చావండన్నట్టుగా కేంద్రం ప్రవర్తిస్తోందని తెలిపారు. విభజనపై దిగ్విజయ్ ను కాలర్ పట్టుకుని నిలదీయాలని జగన్ అన్నారు. లోటస్ పాండ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నీటి కేటాయింపులపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ నివేదిక హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నదీ జలాలపై 28 రాష్ట్రాల్లో ఎవరికీ లేని మండలి మనకే ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోతే నీటి సమస్యలు తలెత్తుతాయని... ప్రాజెక్టులు ఆగిపోతాయని అన్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రాలతో నీటి వివాదాలు ఉన్నాయని గుర్తుచేశారు. విభజనపై దేశంలోని అన్ని పార్టీలను కలుస్తామని జగన్ తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా 26 నుంచి రాష్ట్ర యాత్ర చేపడతానని అన్నారు.

  • Loading...

More Telugu News