: ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చిన రాహుల్ గాంధీ
కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు మతానికి సంబంధించినవి కావని తెలిపారు. తాను కేవలం తమ పార్టీ భావజాలం, సిద్ధాంతాలు, కార్యక్రమాల గురించే చెప్పానన్నారు. తానెక్కడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించలేదని వెల్లడించారు. కాంగ్రెస్ అన్ని మతాల వారిని కలుపుకుపోతుందని చెప్పారు. గత నెలలో నిర్వహించిన ర్యాలీల్లో ముజఫర్ నగర్ బాధితులపై తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... బీజేపీ ఫిర్యాదు మేరకు రాహుల్ ఈ వివరణ ఇచ్చారు.