: 'రామ్ లీలా'లో హిందూ దేవతలను కించపరిచారంటూ పిటిషన్
విడుదలకు ముందే సంజయ్ లీలా బన్సాలీ చిత్రం రామ్ లీలా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ అమిత్ ఆర్య అనే వ్యక్తి ఢిల్లీలోని స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రంలో రామ్ చాహే లీలా పాటలో హిందూ దేవతల అభిరుచులను చాలా తక్కువ చేసి చూపారంటూ పిటిషన్ దారుడు ఆరోపించారు. ఈ పాటలో ప్రియాంక చోప్రా నటించింది. చిత్రం టైటిల్ పై కూడా అమిత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రామ్ లీలా చిత్ర ట్రైలర్ సీడీని కోర్టుకు అందించారు. ఈ పిటిషన్ పై ఈ నెల 11న విచారణ జరగనుంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈ నెల 15న విడుదల కావాల్సి ఉంది.