: విభజనకు శాసన సభ అనుమతి ఉండాల్సిందే : జేపీ
రాష్ట్ర విభజనకు శాసన సభ అనుమతి కచ్చితంగా ఉండాలని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పెద్దలతో జగన్ ఒప్పందం కుదుర్చుకున్నారని జేపీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని చీల్చే నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేశారు.