: నేటి నుంచి తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతులు
రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమాయత్తమయ్యారు. పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన విధానాలపై శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ప్రాంతాల వారీగా నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు, రేపు సీమాంధ్ర నేతలతోనూ, 11, 12 తేదీల్లో తెలంగాణ ప్రాంత నేతలతోనూ చంద్రబాబు సమావేశమవుతారు. ఈ శిక్షణా తరగతుల్లో పార్టీ వైఖరిపై ఆయన స్పష్టమైన సందేశమివ్వనున్నారు.