: గవర్నర్ తో ముగిసిన సీఎం భేటీ
గవర్నర్ ఈసిఎల్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ భేటీ దాదాపు 40 నిమిషాల పాటు జరిగింది. ముఖ్యమంత్రి వెంట మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. రేపు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లనుండడం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.