: సమైక్యంలోనే పరిష్కారం ఉంది: లగడపాటి
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తనదైన శైలిలో సమైక్య గళాన్ని వినిపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం విభజనలో లేదని, సమైక్య రాష్ట్రంలోనే ఉందన్నారు. జీవోఎం పని తీరును తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు కలుస్తున్నారని చెప్పారు. ఎన్నికల ముందు పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం సాధ్యం కాదన్న ఆయన, యూపీఏ సర్కారు ఇప్పటికే మైనారిటీలో ఉందన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరని పేర్కొన్నారు.