: రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నాగుల చవితి
రాష్ట్ర వ్యాప్తంగా నాగుల చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హైదరాబాదులో పలుచోట్ల భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం పది గంటల నుంచే మహిళలు, పిల్లలు, పెద్దలు నాగుల పుట్ట వద్దకు చేరుకుని పూజలు చేశారు. అటు శివాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.