: రుణాల మాఫీపై గందరగోళం.. 12 గంటల వరకు లోక్ సభ వాయిదా
లోక్ సభలో మరోసారి అధికార యూపీఏని ప్రతి పక్షాలు నిలదీశాయి. రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ పథకంలో జరిగిన కుంభకోణంపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ మీరాకుమార్ అంగీకరించలేదు. దీంతో సభ్యులు గందరగోళం సృష్టించడంతో 12 గంటల వరకు సభ వాయిదా పడింది.