: గంగమ్మకు మొక్కిన చార్లెస్ దంపతులు
బ్రిటన్ యువరాజు చార్లెస్, ఆయన శ్రీమతి కెమిల్లా పార్కర్ గంగానదికి హారతి ఇచ్చారు. భారత్ లో తొమ్మిది రోజుల పర్యటన కోసం బుధవారం సాయంత్రం చార్లెస్ దంపతులు ఉత్తరాఖండ్ కు చేరుకున్నారు. రుషికేశ్ లో వేద పండితులు గంగానదికి ఇచ్చిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నట్లు చార్లెస్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గంగా నది తీరంలో కొంతసమయాన్ని వెచ్చించడం తనకు, పార్కర్ కు మంచి అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. చార్లెస్ దంపతులు తమ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలతోపాటు ప్రముఖ పారిశ్రామివేత్తలను కలుసుకుంటారు. తర్వాత శ్రీలంకలో జరిగే చోగమ్ సదస్సుకు వెళతారు.