: విశాఖలో జరిగే భారత్-వెస్టిండీస్ మ్యాచ్ ను అడ్డుకుంటాం : గంటా
ఈ నెల 24న విశాఖలో జరిగే భారత్-వెస్టిండీస్ వన్డేను సమైక్యవాదులమంతా అడ్డుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ బిల్లు ఈ నెలలోనే శాసనసభకు వచ్చే అవకాశం ఉందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటులో పెట్టకుండా తెలంగాణ బిల్లును అసెంబ్లీకి ఎలా పంపుతారని మంత్రి ప్రశ్నించారు.