: భాగ్యనగరం కొందరిని అభాగ్యులను చేస్తుందనుకోలేదు: జేడీ శీలం


రాజధాని, నీళ్లు, నిధులు తదితర క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపాలని మొయిలీని కోరామని కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. ఢిల్లీలో మొయిలీతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అనంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల అభ్యంతరాలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. హైదరాబాద్ లో గత 8 ఏళ్లలో 55వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, రాష్ట్రంలో హైదరాబాద్ లా మరే ప్రాంతమూ అభివృద్ధి చెందలేదన్నారు. హైదరాబాద్ తనది అనేది చదువుకున్న ప్రతీ ఒక్కరి కలగా చెప్పారు. భాగ్యనగరం అందరిదీ అనుకున్నాం గానీ కొందరిని అభాగ్యులను చేస్తుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ప్రాంతాల వారి అభిప్రాయాల పట్ల జీవోఎం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News