: నేడు ప్రధానితో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశంపై 6 పేజీల నివేదికను వీరు ప్రధానమంత్రికి ఇవ్వనున్నారు. దీనికి ముందు కేంద్రమంత్రి వీరప్ప మొయిలీతో సీమాంధ్ర కేంద్రమంత్రులు సమావేశమవుతారు. చమురు, సహజవాయువుకు సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చిస్తారు.