: ఎక్కడ ఎక్కువ కాలుష్యం ఉందో ఇది చెబుతుంది


ఇప్పుడంతా యాప్‌లమయం. దేనికైనా సరే నేనున్నానంటూ కొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. మనం సమయానికి మందులు వేసుకోవడాన్ని గుర్తుచేయడానికి, మనల్ని ఆపదలనుండి కాపాడడానికి, మనం వెళ్లే దారిని చూపేందుకు... ఇలా పలు విషయాలకు యాప్‌లు వస్తున్నాయి. ఇప్పుడు శబ్ద కాలుష్యం ఎక్కడ ఎక్కువగా ఉంది? అనే విషయాన్ని చెప్పడానికి కూడా ఒక కొత్త యాప్‌ వచ్చింది. ఇప్పుడు పట్టణాల్లో, నగరాల్లో శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. ఇది మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే నగరాల్లో ఎక్కువగా ధ్వని కాలుష్యం ఉన్న ప్రాంతాలను ముందుగా తెలుసుకోవడానికి వీలుగా స్మార్ట్‌ ఫోన్‌ అప్లికేషన్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు.

ఆస్ట్రేలియాలోని కామన్‌వెల్త్‌ శాస్త్ర, పారిశ్రామిక అధ్యయన సంస్థ (సీఎస్‌ఐఆర్‌ఓ), న్యూసౌత్‌వేల్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇయర్‌ ఫోన్‌ పేరుతో ఒక యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ యాప్‌లో రణగొణధ్వనుల స్థాయి ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించే సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేసినట్టు ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న భారత సంతతికి చెందిన రాజీబ్‌ రాణా చెబుతున్నారు. ఈ యాప్‌ పాఠశాలలు ఏర్పాటు చేసుకోవాలన్నా, శబ్ద కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుందని, ఏ ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం తీవ్రత ఎంత ఉందో దీని సాయంతో అంచనా వేసుకుని తెలుసుకునేందుకు వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News