: వోల్వో బస్సు ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు మొదలైంది : డీజీపీ


మహబూబ్ నగర్ జిల్లా పాలెంలో సంభవించిన వోల్వో బస్సు ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు ప్రారంభమైందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఇప్పటివరకు ఈ దుర్ఘటనలో 34 మంది మృతలును గుర్తించామని, మరో 9 మందిని గుర్తించాల్సి ఉందని వెల్లడించారు. భద్రత పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మైన్ ప్రూఫ్ వాహనాలను సమకూర్చామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు టోల్ గేట్ల వద్ద తనిఖీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. దీనికి తోడు టోల్ గేట్ల వద్ద బ్రీత్ ఎనలైజర్లను ఏర్పాటుచేయనున్నట్లు డీజీపీ చెప్పారు. అత్యాచారాల నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలో 2013 ఎస్ఐ పరీక్షా ఫలితాలను విడుదల చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News