: తొలి రోజు ఆటలో భారత్ దే హవా


భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్ 21, మురళీ విజయ్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్... భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుదామనుకుని బోల్తా పడింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాట్స్ మన్ మొత్తం తోక ముడిచారు.

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ హవా కొనసాగింది. మ్యాచ్ ఆరంభం నుంచి బౌలర్లు బ్యాట్స్ మెన్ పై ఆధిపత్యం ప్రదర్శించారు. తొలుత గేల్ ను భువనేశ్వర్ కుమార్ బలి తీసుకుంటే, పావెల్ ను షమి పెవిలియన్ కు పంపాడు. తరువాత శామ్యూల్స్, బ్రావో కాస్త ఆదుకున్నట్టు కన్పించినా... వీరిని కూడా షమి పెవిలియన్ చేర్చాడు.

అశ్విన్ చక్కని బంతులతో రెండు వికెట్లు తీయగా... ఓజా, సచిన్ లు చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలో దిగిన భారత బ్యాట్స్ మెన్ వికెట్లేమీ కోల్పోకుండా 37 పరుగులు చేశారు. మరో నాలుగు రోజుల ఆట మిగిలి ఉంది.

  • Loading...

More Telugu News