: సీమలో వాస్తవ పరిస్థితులను అన్ని పార్టీలు గుర్తుంచుకోవాలి: జేసీ
రాయలసీమలో ఉన్న వాస్తవ పరిస్థితులను అన్ని పార్టీలు గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన మొదట తెచ్చింది తానేనన్నారు. రాయల తెలంగాణపై కేంద్రం ఆలోచిస్తుందని అనుకుంటున్నానన్నారు. విభజన అనివార్యం అయ్యేలా కనిపిస్తోందని అనంతపురంలో మీడియాతో అన్నారు.