: 234 పరుగులకు విండీస్ ఆలౌట్


భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో విండీస్ పేలవ ఆటతీరు ప్రదర్శించింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ ఆలౌట్ అయింది. శామ్యూల్స్(65), చందర్ పాల్(36), పావెల్(28), బ్రావో(23) కాస్త ఫర్వాలేదనిపించగా మిగిలిన బ్యాట్స్ మన్ అంతా భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు. దీంతో వెస్టిండీస్ 79 ఓవర్లలో 234 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన లోకల్ బోయ్ షమి, తన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే నాలుగు వికెట్లతో రాణించాడు. అశ్విన్ 2 వికెట్లు, భువనేశ్వర్, ఓజా, సచిన్ లు చెరో వికెట్ తీశారు. దీంతో తొలి రోజు మూడో సెషన్ లోనే విండీస్ కథ కంచికి చేరింది. టీ బ్రేక్ తరువాత భారత్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News