: అదుపు తప్పిన కారు.. ట్రైనీ ఐఏఎస్ అధికారి మృతి
ట్రైనీ ఐఏఎస్ అధికారులు ప్రయాణిస్తున్న కారు పంజాబ్ లో రోడ్డు ప్రమాదానికి గురైంది. మోగా జిల్లాలో మోగా-బర్నాలా రహదారిపై దాల గ్రామం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ట్రైనీ ఐఏఎస్ అధికారి నిషాంత్ కుమార్ మృతి చెందారు. మరో ముగ్గురు ట్రైనీ ఐఏఎస్ లు పి.మాలిక్, అజిత్ సింగ్, హర్ష కుమార్, డ్రైవర్ రాజ్ కుమార్ గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.