: కన్నతల్లిని కడతేర్చిన కసాయి
మహబూబ్ నగర్ జిల్లాలో ఓ కసాయి కన్నతల్లిని కడతేర్చాడు. హన్వాడ మండలంలోని గొండ్యాల గ్రామంలో కన్నతల్లి డబ్బులివ్వలేదని ఆమె కొడుకు దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈడిగ బాలకృష్ణమ్మను ఆమె కొడుకు నారాయణ మద్యం మత్తులో హత్య చేశాడు. మృత దేహాన్ని ఇంటిలో ఉంచడంతో ఘటన వెలుగు చూసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.