: రాష్ట్ర విభజన ఆర్ఎస్ఎస్ కు ఉపయోగపడుతుంది : ఒవైసీ
అనివార్య పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగితే... అది ఆర్ఎస్ఎస్ కు ఉపయోగపడుతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. జీవోఎంకు నివేదిక సమర్పించిన నేపథ్యంలో, మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ తెలంగాణకే చెందాలని గతంలో పలుమార్లు చెప్పామని ఎంఐఎం అధినేత అన్నారు. హైదరాబాద్ పై కేంద్రానికి ఎలాంటి అధికారాలు ఉండరాదని ఆయన డిమాండ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ పోలీసుల కొరత ఏర్పడుతుందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో పోలీసు బలగాలను ఎక్కడ నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారులు... దళితులు, ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. బేషరతుగా హైదరాబాద్ ను తెలంగాణ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని తెలిపారు.